అమెరికాలోని న్యూయార్క్ సిటీలో టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ మహిళ రెండు కత్తులతో జనంపై విరుచుకుపడింది. కత్తులతో హల్‌చల్ చేసింది. రోడ్డుపై వెళుతున్న జనంపై దాడికి పాల్పడింది. కత్తి పోట్ల కారణంగా ఓ వ్యక్తి చనిపోగా.. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు మహిళను అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వారిపై కూడా కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించింది. పోలీసులు ఆమెను కాల్చి చంపారు.
ఆ మహిళ పోలీసుల హెచ్చరికలను లెక్కచేయలేదు. ఎదురుగా ఉన్న పోలీసులపై కత్తులతో దాడి చేయడానికి ప్రయత్నించింది

