loader

మహారాష్ట్ర రాజధాని ముంబైలో చర్చిగేట్‌ ప్రాంతంలోని మహర్షి కర్వే రోడ్డులో ఉన్న ఇన్‌కమ్‌టాక్స్‌ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఏడు అంతస్తులున్న ఈ బిల్డింగ్‌లోని బేస్‌మెంట్‌, ఫస్ట్‌ ఫ్లోర్‌ వరకు మంటలు వ్యాపించాయి. దీంతో పై అంతస్తుల్లో ఉన్న ఉద్యోగులు అక్కడ చిక్కుకుపోయారు. ఈ అగ్నిప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక, అత్యవసర వాహనాలతో ఫైర్‌ సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. ఒక బృందం మంటలు ఆర్పడంలో నిమగ్నం కాగా, పై అంతస్తుల్లో చిక్కుకున్న ఉద్యోగులను మరో టీం రక్షించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON