ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేసిన ‘దిమాగీ నక్సల్స్’ (మేధో నక్సలైట్లు) వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ‘అర్బన్ నక్సల్స్’, పురుగులు, బొద్దింకలు అంటూ సంబోధించిన వారు, ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలకు ‘దిమాగీ నక్సల్స్’ అంటూ కొత్త పేరు తగిలించారని ప్రకాశ్ రాజ్ ఎద్దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీసే విమర్శకులకు కనీసం మెదడు (బుద్ధి) ఉందనే విషయాన్ని ‘సుప్రీం లీడర్’ ఒప్పుకున్నందుకు సంతోషమని ఆయన వ్యాఖ్యానించారు.