శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా తగ్గుతున్నాయి. యుద్ధ ప్రభావం కారణంగా,ఇంధన సర్ఛార్జితో విమాన టికెట్ల ధరల పెంపు తీవ్ర ప్రభావాన్ని చూపించింది. గతేడాది జూన్ నెలలో 4.42లక్షల మంది విదేశీ ప్రయాణికులు రాకపోకలు కొనసాగించగా, జూన్ నెలలో 4.30లక్షల మంది మాత్రమే ప్రయాణించడం గమనార్హం. మెట్రో నగరాలైన దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుల్లో వృద్ధిరేటు మైనస్‌లలోకి పడిపోయింది. గతేడాది త్రైమాసికంలో 11.37లక్షల విదేశీ ప్రయాణికులు ప్రయాణిస్తే ఈ ఏడాది 11.20 లక్షలు అని AAI నివేదికలో తెలిపింది.