స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణ లోకభవన్లలో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమాలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి. ఏపీలోని లోకభవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చిన తేనీటి విందుకు సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు దంపతులకు గవర్నర్ దంపతులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీజే జస్టిస్ లిసా గిల్, ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొనగా.. విచ్చేసిన అతిథులను గవర్నర్ స్వయంగా పలకరించారు. మరోవైపు, తీవ్ర జ్వరంతో బాధపడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.