80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భముగా ఇండియాకు ప్రపంచ దేశాలు, దేశాధినేతలు కూడా స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రష్యా, ఇండియా, రష్యా మధ్య స్నేహం ఇలాగే కొనసాగుతుందనే విశ్వాసం ఉందని పుతిన్ ఆకాంక్షించారు. ఇండియా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్గోజ్ అన్నారు. సింగపూర్ అధ్యక్షుడు థర్మాన్ షణ్ముగరత్నం, నేపాల్ తరఫున ప్రధాని బాలెంద్ర షా, మాల్దీవ్స్ అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జు వంటి దేశాధినేతలు ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు.