తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రేషన్ కార్డు కేవలం ఓ ప్లాస్టిక్ వస్తువు కాదని, పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. పేదల ఆకలి తీర్చడమే స్మార్ట్ రేషన్ కార్డు ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. పేదలకు సంక్షేమం అందించడం తమ ప్రభుత్వ బాధ్యత, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతిపక్షాలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీ వేర్వేరు కాదని.. బొమ్మ, బొరుసులాంటివేనని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.