సీజేఐని రావొద్దన్న నల్సార్ విద్యార్ధుల్ని లాయర్లుగా నమోదు కాకుండా ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం కావడంతో గంటలోనే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) చైర్మన్ మనన్ మిశ్రా వాటిని వెనక్కి తీసుకున్నారు. నల్సార్ వర్శిటీ విద్యార్థి , అధ్యాపక వర్గానికి బీసీఐ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీఐ చర్యలను భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడిగా వారు అభివర్ణించారు. బీసీఐ చర్యలు నల్సార్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛపై భయానక ప్రభావాన్ని సృష్టిస్తున్నాయని ఆరోపించారు.