రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) ప్రభుత్వ ఉద్యోగార్థులకు భారీ అవకాశాన్ని కల్పించింది. CEN No. 04/2026 నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లు మరియు ప్రొడక్షన్ యూనిట్లలో ఖాళీగా ఉన్న జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) పోస్టుల భర్తీ చేపట్టింది. మొత్తం 3,993 పోస్టుల్లో సికింద్రాబాద్ రైల్వే జోన్కు 110 పోస్టులు కేటాయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: ఆగస్టు 14, 2026