ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కాకినాడలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అనంతరం రాజమహేంద్రవరం
వచ్చి ధవళేశ్వరంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమం సమయంలో పవన్‌కు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో కార్యక్రమాన్ని మధ్యలోనే ముగించుకుని వెళ్లిపోయారు. రాజమహేంద్రవరంలో వైద్యులు పరీక్షలు నిర్వహించి పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. ఫలితంగా శనివారం సాయంత్రం లోక్ భవన్‌లో నిర్వహించాల్సిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు ఆయన కార్యాలయం ప్రకటించింది.