తెలంగాణలో మందుబాబులు బాటిళ్లను భారీగా ఖాళీ చేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు రాష్ట్రంలో ప్రతీ నిమిషానికి సగటున సుమారు 3,600 బాటిళ్లు మద్యం.. మరో 1,600 బాటిళ్లు బీర్‌లు అమ్ముడైనట్లు గణాంకాల ఆధారంగా వెల్లడైంది. ఈ 4 నెలల వ్యవధిలో తెలంగాణలో బీర్, ఐఎంఎఫ్‌ఎల్ కలిపి సుమారు 3.5 కోట్ల కేసుల విక్రయాలు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.14,668 కోట్లు. ఇందులో బీర్‌లు సుమారు 2.21 కోట్ల కేసులు, ఐఎంఎఫ్‌ఎల్ 1.29 కోట్ల కేసులుగా నమోదయ్యాయి.