స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా నిర్వహించే ఎట్ హోమ్ రిసెప్షన్ కార్యక్రమం ఎప్పటిలానే అత్యంత వైభవంగా జరిగింది.శనివారం రాత్రి నిర్వహించిన ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆతిథ్యం ఇచ్చారు. వందేమాతరం, జాతీయ గీతం జనగణమన ఆలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ వేదిక వద్దకు చేరుకున్నారు. కార్యక్రమానికి విచ్చేసిన నాయకుల్ని, విశిష్ట అతిథుల్ని ఆప్యాయంగా పలకరించి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ అతిథులతో ముచ్చటిస్తూ కనిపించారు.