ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బోనాల వేడుకల్లో ఫరియా పాల్గొనడాన్ని కొందరు తప్పుబట్టారు. ఫరియా ముస్లిం కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన కారణంగా, హిందూ పండుగలో ఎందుకు పాల్గొన్నావంటూ కొందరు,‘ఇస్లాం ద్రోహి’ అంటూ కొందరు కామెంట్లు చేయడం, దీంతో ఫరియా ఒక ఎమోషనల్ వీడియోను SMలో షేర్ చేసింది ఆమె తల్లి ముస్లిం కుటుంబంలో జన్మించి తర్వాత హిందూ మతాన్ని, తండ్రి హిందూ కుటుంబంలో జన్మించి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారు. తన తండ్రి ఇస్లాంలోని మంచి విషయాలను తనకు నేర్పించారని ఫరియా తెలిపింది.