ఇండోనేసియాలో శనివారం తెల్లవారు జామున భారీ భూకంపం సంభవించి దాదాపు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. భవనాలు, ఇళ్లు కూలిపోయాయి. సహాయ బృందాలు ఇప్పటివరకు 38 మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశాయని వీటిలో సిక్కా, మాంగ్గరై, ఈస్ట్మాంగ్ గరై ప్రాంతాల నుంచే మృతదేహాలు ఎక్కువగా బయటపడ్డాయని, మాంగ్గరై లోని రియోక్ గ్రామంలో విరిగిపడిన కొండచరియ నుంచి 16 మృతదేహాలు బయటపడ్డాయని జాతీయ వైపరీత్యాల నిర్వహణ సంస్థ అధినేత సుహారియంతో వెల్లడించారు. నగేకియో రీజెన్సీ నుంచి 2000 మంది గ్రామస్థులను తాత్కాలిక షెల్టర్లకు తరలించారు.