మాదాపూర్ లోని సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు స్వచ్ఛ ఆటో కార్మికుల ధర్నాకు దిగారు. చెత్త సేకరణ ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించటంపై నిరసన వ్యక్తం చేశారు. స్వచ్ఛ ఆటో, రిక్షా కార్మికులు సుమారు వెయ్యి మంది చెత్త సేకరణ కార్మికులు సిఎంసి కార్యాలయాన్ని ముట్టడించారు. వేల ఆటోలు కొనుక్కొని తమ బతుకులు రోడ్డు మీద ఇప్పుడు పడేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. సిఎంసి కమిషనర్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు తమ జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నామని కార్మికులు మండిపడ్డారు.