బిగ్ బాస్ విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై విశాఖపట్నంలో కేసు నమోదైంది. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి తనను మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రాహుల్ సిప్లిగంజ్ తో సహా 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడంతో పాటు ఈ వ్యవహారంలో రాహుల్ సప్లిగంజ్ తో సహా కొందరు జర్నలిస్టులతో పాటు మరికొందరు ప్రమోయం ఉందని యువతి ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం.