బిహార్ లో విద్యార్థులపై కాల్పులు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. విద్యార్థులపై ఎఫ్ఐఆర్ లు ఉండవని కేంద్రం ఇచ్చిన హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. విద్యార్థులను అరెస్టు చేసి ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారని రాహుల్ గాంధీ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో పెల్లెట్లు, పాట్నాలో ఎకే 47 ప్రయోగించారని రాహుల్ గాంధీ విమర్శించారు. విద్యార్థులను అణిచివేయడంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేనని, విద్యార్థులకు మోడీ క్షమాపణ చెప్పాల్సిందేనని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.