భారత సంతతికి చెందిన నాసా (NASA) వ్యోమగామి అనిల్ మీనన్ ఇవాళ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. రష్యాకు చెందిన సోయజ్ ఎంఎస్-29 (Soyuz MS-29) వ్యోమనౌక ద్వారా కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి ఆయన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) బయలుదేరారు. 49 ఏళ్ల అనిల్ మీనన్ అమెరికాలోని మిన్నియాపాలిస్లో జన్మించారు.
ఆయన తండ్రి భారతీయుడు కాగా, తల్లి ఉక్రెయిన్ వాసి. నాసా వ్యోమగామిగా 2021లో ఎంపిక కావడానికి ముందు ఆయన వైద్యం, సైనిక సేవల్లో అనుభవం సాధించారు.