1977లో తండ్రి మరణంతో ముద్రగడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1978లో జనతాపార్టీ తరఫున ప్రత్తిపాడు నుంచి తొలిసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1982లో తెలుగుదేశంలో చేరి 1983, 1985 ఎన్నికల్లో వరుసగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో మంత్రిగా పని చేశారు. ప్రత్తిపాడు నుంచి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఓటమి చవిచూశారు. 1999లో కాకినాడ నుంచి ఎంపీగా గెలుపొంది పార్లమెంట్‌కు వెళ్లారు.

