జానకి పార్థివ దేహానికి అంత్యక్రియలు జరిగాయి. పాత సంప్రదాయాలను పక్కనపెట్టి ఆమెకు ఎంతో ఇష్టమైన మనవరాలు, ఆమె కుమారుడు మురళీకృష్ణ కూతురు అప్సర విద్యుల స్వయంగా తలకొరివి పెట్టి దహన సంస్కారాలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల మధ్య అప్సర తన నానమ్మ చితికి నిప్పంటించి చివరి క్రతువును పూర్తి చేశారు. అప్సర మాట్లాడుతూ, “ఆమె ప్రపంచానికి దిగ్గజ గాయని, కానీ నాకు మాత్రం ఎంతో ప్రేమను పంచిన గొప్ప నానమ్మ. ఆమె ఎప్పుడూ తన చిరునవ్వుతో అందరినీ అలరించేది” అని భావోద్వేగం చెందారు.