తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె అన్నామలై కీలక వ్యాఖ్యలు చేశారు ‘‘నేను హిందువుని, విభూతి మరియు కుంకుమ ధరిస్తాను; కానీ బయటకు వచ్చినప్పుడు, నా కులం, మతాన్ని ఇంట్లోనే ఉంచి, ప్రజలందరికీ చెందిన సాధారణ వ్యక్తిగా మీ ముందు నిలబడతాను. ప్రతిసారీ మతాన్ని హైలైట్ చేయాల్సిన లేదా ప్రదర్శించాల్సిన అవసరం లేదు. నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడు. ఒకరు గొప్పవారని మరొకరు తక్కువని మాట్లాడడు. కులం, మతం ఆధారిత రాజకీయాలు ఇక చాలు’’ అని అన్నామలై పేర్కొన్నారు.