గతంలో ప్రభుత్వాలు అనుసరించిన ‘జనాభా నియంత్రణ’ విధానాన్ని పక్కన పెట్టి, ‘జనాభా సంరక్షణ’ అనే కొత్త దిశలో అడుగులు వేస్తున్నట్లు ప్రపంచ జనాభా దినోత్సవంలో సీఎం చంద్రబాబు తెలిపారు. ‘జనంతోనే అభివృద్ధి, జనాభా ఉంటేనే భవిష్యత్తు’ అనే నినాదాన్ని ప్రస్తావిస్తూ, పిల్లలే సంపద అనే భావనను ప్రబలంగా ప్రోత్సహించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో జనాభా తగ్గిపోతున్న నేపథ్యంలో, భారతదేశంలో కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. అభివృద్ధి సంతులనం కోసం జనాభా నిర్వహణ కీలకమని ఆయన అన్నారు.