నటుడు ప్రకాష్ రాజ్ ప్రశ్న రావణ్ అరెస్టు ఉదంతంపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు. కోర్టు బెయిల్ ఇస్తోన్నా కూడా ఇలా రావణ్ పై 30-35 కేసులు పెట్టి ఏపీ ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ప్రకాష్ రాజ్ విమర్శించారు. ఇలా ఎక్కడి దాకా వెళ్తారు? ఏంటీ సిగ్గులేని కక్షసాధింపు?, ఏం చేయాలనుకుంటున్నారు.. అని నిలదీశారు. ప్రజలు ఏపీ ప్రభుత్వ పనితీరును చూస్తోన్నారని, ఫ్రస్ట్రేషన్ ను గమనిస్తోన్నారని ప్రకాష్ రాజ్ చెప్పారు. ఎవరైనా గానీ అధికారాన్ని ఇలా దుర్వినియోగం చేయలేరని అన్నారు.