రెండున్నరేళ్ల తర్వాత రేవంత్ సర్కార్ తూతూ మంత్రంగా కేవలం 5 వేల పోస్టులతో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా.. నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. పోస్టుల సంఖ్యను 5000 నుంచి 20000 పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు సోమవారం హైదరాబాద్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డును ముట్టడించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులను అరెస్ట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఈడ్చుకెళ్తూ వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు రేవంత్ సర్కార్ నిరుద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో మరోసారి చెప్పకనే చెబుతున్నాయి.