ఏపీలోని బాపట్ల జిల్లా దేవరపల్లికి చెందిన దొప్పలపూడి రాంబాబు కుమారుడు వెంకటేశ్ అమెరికాలోని ఒమాహా నగరంలో నివాసం ఉంటున్నారు. కాన్సాస్‌లోని వెల్లింగ్టన్ సమీపంలో ఇటీవల భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదల్లో ఆయన కొట్టుకుపోయారు. ఈ ఘటనపై పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కేంద్ర, రాష్ట్ర మంత్రులకు లేఖలు రాశారు. తక్షణమే గాలింపు చర్యలు చేపట్టాలని.. ఈమేరకు అక్కడి ఎంబసీతో మాట్లాడాలని రాష్ట్ర మంత్రి లోకేశ్ కు విజ్ఞప్తి చేశారు.