జపాన్ లో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం జపాన్‌లో మరోసారి భూమి కంపించింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.1గా నమోదైంది. అమోరి ప్రిఫెక్చర్ సమీపంలో 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ విభాగం (JMA) వెల్లడించింది. కాగా గత కొన్ని రోజులుగా పలు దేశాలను భూకంపాలు వణికిస్తున్నాయి.