మార్కాపురం అంటే కరవు ప్రాంతమని, అలాంటి ప్రాంతానికి కష్ణా జలాలు వస్తాయని ఎవరూ ఊహించలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. శనివారం మార్కాపురం జిల్లాలో పర్యటించిన ఆయన వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించారు. అనంతరం స్థానిక రైతులు, నిర్వాసితులతో మాట్లాడారు. మార్కాపురం ప్రాంతానికి నీళ్లివ్వాలని
ఎన్టీఆర్ ఎప్పుడూ ఆలోచించేవారని గుర్తుచేసుకున్నారు.1996లో వెలిగొండకు పునాది వేశామని, ఇప్పుడు పునరావాసం కింద ఇక్కడి రైతులకు రూ.300 కోట్లు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు.