రాజస్థాన్‌లోని బిచ్చివార పోలీస్ స్టేషన్లో జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ వృద్ధుడు ఎదుటే మహిళా కానిస్టేబుల్ డెస్క్‌పై రెండు కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా పోలీసు అధికారులు వెంటనే స్పందించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడినట్లు భావించి మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఆమెపై శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలను ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.