ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని మంత్రివర్గంలో కీలక మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఈ వారమే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అంశంపై వివరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిశారు. మరోవైపు బీజేపీలోనూ సంస్థాగత నిర్మాణంలో మార్పులు జరగనున్నాయి. కేంద్రం మంత్రివర్గంతోపాటు బీజేపీ కేంద్ర పదవుల్లోనూ మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల గురించి కొందరు కేంద్ర మంత్రులతో కూడా నితిన్ నబిన్ ఇదివరకే మాట్లాడినట్లు తెలుస్తోంది.