పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్లోనే చనిపోయారు. నగరవనం వద్ద ఆగి ఉన్న లారీని తుఫాను వాహనం ఢీ కొట్టడంతో ఈ దుర్ఘటన జరిగింది. మృతి చెందిన బంధువులను పరామర్శించేందుకు వెళ్తుండగా ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. వారిని మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చనిపోయిన వారు తుఫాను వాహనంలో ఇరుక్కుపోయారు