మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే అంతర్జాతీయ ప్రసిద్ధ నెల్లూరు ‘రొట్టెల పండుగ’ నేటి నుంచి అత్యంత వైభవంగా ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక వేడుకల కోసం ఒక రోజు ముందు నుంచే భక్తులు భారీగా తరలిరావడంతో నెల్లూరు నగరం కోలాహలంగా మారింది. స్వర్ణాల చెరువు తీరాన ఉన్న ప్రసిద్ధ బారాషహీద్ దర్గా వేదికగా ఐదు రోజుల పాటు ఈ వార్షిక ఉత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి సైతం లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో స్వర్ణాల చెరువు పరిసరాలు జనసముద్రాన్ని తలపిస్తున్నాయి