2023లో భారత పర్యటన సందర్భంగా న్యూఢిల్లీ రహదారుల వెంట తనకు స్వాగతం పలుకుతూ పోస్టర్లు కనిపించాయని, అప్పట్లో ఇటలీ ఉప ప్రధాని ఆంటోనియో తజానీ సరదాగా మీరు న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మిలియన్ ఓట్లు వస్తాయి అని వ్యాఖ్యానించారని మెలోనీ తన కొత్త పుస్తకంలో పేర్కొన్నారు. తన పుస్తకంలోని ‘హెడ్ హెల్డ్ హై అమంగ్ ది వరల్డ్ గ్రేట్స్’ అధ్యాయంలో విజయవంతమైన దౌత్యానికి కేవలం అధికారం సరిపోదని, వ్యక్తిగత అనుబంధం కూడా కీలకమని పేర్కొన్నారు.