వైసీపీ నేతల వైఖరిపై తీవ్రస్థాయిలో మంత్రి దుర్గేష్ ధ్వజమెత్తారు. సాయికృష్ణ అదృశ్యం కేసులో కూటమి ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా దానికి కులం రంగు పూసి రాజకీయ లబ్ధి పొందడమే ధ్యేయంగా వైసీపీ దిగజారిపోయిందని విమర్శించారు. ప్రభుత్వం తప్పు చేస్తే నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలే తప్ప, ప్రతి అంశంలోనూ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని లాగి, ఆయనను ఒక కులానికి పరిమితం చేయాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు