ఆత్మ నిర్భర భారత్లో భాగంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన మూడు యుద్ధ నౌకలను ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. ఆదివారం కోల్కతాలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ యుద్ధ నౌకలు.. ఐఎన్ఎస్ దూనగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్లను నౌకదళానికి ఆయన అప్పగించారు. ఈ నౌకల ప్రవేశాన్ని వీక్షించే అవకాశం లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. భారత నౌకదళంతోపాటు వాటి అభివృద్ధిలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలతో ముంచెత్తారు.