యోగాకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోదీ చొరవతో 190 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రపంచానికి భారత్ విశ్వగురుగా మారుతోందని… ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలిగే స్థాయికి భారత్ ఎదుగుతోందన్నారు. ఫిజికల్, మెంటల్ ఫిట్ నెస్ పెంచేది యోగానే అని,. యోగాను ప్రజలకు దగ్గర చేసిన రామ్ దేవ్ బాబా కృషి అమోఘం అని కొనియాడారు.