కరీంనగర్ జిల్లా అలుగునూర్ శివారులో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ , కండక్టర్, ప్రయాణికులు అప్రమత్తం కావడంతో ప్రాణ నష్టం తప్పింది. డ్రైవర్ సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా చేరుకొని మంటలు ఆర్పేశారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. షార్ట్ సర్క్యూట్ తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.