దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ (NEET-UG) 2026 పునఃపరీక్ష నేడు (జూన్ 21, ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరుగనుంది. అత్యంత రహస్యంగా, కట్టుదిట్టమైన రక్షణ వలయంలో ప్రశ్నపత్రాలను స్థానిక పోలీసులు, సీఆర్పీఎఫ్ బలగాల పహారా మధ్య పరీక్షా కేంద్రాలకు సురక్షితంగా తరలించారు. దేశంలోని 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 కేంద్రాలలో మొత్తం 22.79 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు.