దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆందోళనలు రెండో రోజుకు చేరాయి.నీట్-యూజీ 2026 పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలకు బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకూ ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. ఓ వైపు పోలీసులు అనుమతి గడువు ముగిసినప్పటికీ అక్కడ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ముఖ్య నగరాల్లో ఆందోళనలు చేపట్టిన సీజేపీ.. ఆ తర్వాత దిల్లీకు చేరుకుంది.