తమిళనాడు ముఖ్యమంత్రి, ‘టీవీకే’ అధినేత విజయ్.. అధికార పీఠాన్ని దక్కించుకున్న వెంటనే తన తదుపరి సంచలన అడుగు వేశారు. పార్టీ సిద్ధాంతాలను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు ఒక సరికొత్త శాటిలైట్ టీవీ ఛానెల్‌ను రంగంలోకి దించుతున్నారు. దానికి పెట్టిన పేరే.. ‘వెట్రి’ (VETRI). డీఎంకే (DMK) వెనుక సన్ న్యూస్, కలైంజర్ న్యూస్ వంటి మీడియా దిగ్గజాలు ఉంటే, ఏఐఏడీఎంకే (AIADMK) ప్రయోజనాల కోసం ‘న్యూస్ జే’ పనిచేస్తోంది.