భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయంగా మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. స్లొవేకియా దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (1st క్లాస్)’ (The Order of the White Double Cross) ను ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని చేతుల మీదుగా ప్రధాని మోదీ స్వీకరించారు. తాజాగా అందుకున్న స్లొవేకియా అవార్డుతో కలిపి మోదీ ఖాతాలో ఇప్పటివరకు చేరిన అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 33కు చేరడం విశేషం.