రాజస్థాన్ రాజధాని జైపూర్ పరిధిలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ఒక టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో ముగ్గురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.జైపూర్ పరిధి, నాగోరియన్ ప్రాంతంలోని ఒక టపాసుల పరిశ్రమలో ఈ పేలుడు జరిగింది. ఉదయం 11.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా మంటలు భారీగా వ్యాపించాయి. చుట్టూ పొగలు అలుముకున్నాయి. ఈ మంటలు, పొగల ధాటికి అక్కడ పనిచేస్తున్న కార్మికుల్లో ముగ్గురు మరణించారు.