పంజాబ్ రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫిరోజ్‌పూర్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న పికప్ వాహనాన్ని, ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 12 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జలాలాబాద్‌లోని రైల్వే కాలనీకి చెందిన బాధితులు మృతిచెందిన తమ బంధువు అస్థికలను నిమజ్జనం చేయడానికి బియాస్‌కు వెళ్తుండగా, ఫిరోజ్‌పూర్‌కు 18 కిలోమీటర్ల దూరంలోని జంగా వాలా గ్రామం సమీపంలో ప్రమాదం జరిగింది.