గోదావరిజిల్లాల శివారుప్రాంతం రంపచోడవరం గిరిజన గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. వన్యప్రాణులను వేటాడే విల్లు (బాణం) తన సొంత అన్నయ్య పై తమ్ముడు వేశాడు. దీంతో ఛాతి ఎదురభాగం నుంచి వెనకాల భాగంకు ఈ బాణం దూసుకెళ్లడంతో.. దెబ్బతిన్న అన్న అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మనిషి చాతిని రెండుగా చీల్చి లోపలికి వెళ్ళిన ఆ ఇనప బాణమును బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు.