మంత్రాలయం దగ్గర తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు ఇవాళ 8 మంది వెళ్లారు. ఐతే.. వారు నదిలో నీరు ఎక్కువగా ఉందనీ, ఎక్కువ లోతు ఉంటుందని అంచనా వెయ్యలే 8 మందిలో ఐదుగురు మిస్సింగ్ అయ్యారు. మంత్రాలయం దగ్గర బంధువుల ఇంట్లో పూజ కోసం వీరంతా వచ్చారని తెలిసింది. ప్రస్తుతం నదిలో నీరు కొంత తక్కువగానే ఉంది. అందుకే వారు.. నదిలో లోతు పెద్దగా ఉండదు అనుకున్నారు. నీటిలో దిగి, గల్లంతైన వారిలో ఐదేళ్ల పిల్లాడు కూడా ఉన్నట్లు తెలిసింది.