హైదరాబాద్‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన అనంతరం.. ఏపీలోనూ తెలంగాణ నేతల విగ్రహాలు పెట్టాలనే డిమాండ్లు మొదలయ్యాయి. ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహంతో పాటుగా దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు బిడ్డ పీవీ నరసింహారావు విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ మేరకు తెలంగాణ బీజేపీ అధికార
ప్రతినిధి రాణీ రుద్రమ రెడ్డి.. ఏపీ ప్రభుత్వాన్ని , సీఎం చంద్రబాబును కోరారు. కాళోజీ, దాశరథి, సినారె వంటి తెలంగాణ వైతాళికుల విగ్రహాలు పెట్టేందుకు అనుమతి, స్థలం ఇవ్వాలని కోరారు.