అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రం ఒమాహాలో ఉన్న అమెరిక్ఇన్ అనే హోటల్లో పనిచేసే కావన్ కుమార్ పటేల్ మానవ అక్రమ రవాణాదారులతో చేతులు కలిపి, ఒక మైనర్ బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టిన కేసులో 27 ఏళ్ల భారతీయ యువకుడికి అమెరికా న్యాయస్థానం 10 సంవత్సరాల కఠిన జైలు శిక్ష విధించింది. గుజరాత్‌కు చెందిన కావన్ కుమార్ పటేల్ అనే వ్యక్తి ఈ ఘోర నేరానికి పాల్పడినట్లు యూఎస్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది.