సింగరేణిపై వివాదస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ భవన్ వద్ద ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాల్క సుమన్ అరెస్ట్ కు ముందు తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. తెలంగాణ భవన్ ఆవరణలో మీడియా సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల తర్వాత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసిన తనను మళ్లీ అరెస్ట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.