మే 30న దాసరి నారాయణ రావు వర్ధంతి. దాసరి జీవించి ఉన్నప్పుడు హైదరాబాద్ సిటీలోని ఫిల్మ్ నగర్ సమీపంలో ఉండేవారు. మరణించిన తర్వాత మొయినాబాద్‌లో అంత్యక్రియలు నిర్వహించారు. అక్కడ సమాధి కట్టారు. ఇప్పుడు అది దిక్కు మొక్కు లేకుండా ఉంది. దాసరి వర్ధంతి నాడు కూడా ఆయన సమాధిని కుటుంబ సభ్యులు ఎవరూ పట్టించులేదు. శుభ్రం చేయడం వంటివి చేయలేదు. తమ దైవం దాసరి అని, తమకు బ్రేక్ ఇచ్చేది దాసరి అని చెప్పుకున్న లెజెండరీ నటులు ఉన్నారు. కనీసం వాళ్ళు కూడా పట్టించుకోలేదు.