ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం ఎండల తీవ్రత దృష్ట్యా మే నెలతో సెలవులు ముగిసి, జూన్ 1వ తేదీ నుంచే కాలేజీలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న బోర్డు.. కాలేజీల రీఓపెనింగ్ తేదీని జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. దీనివల్ల విద్యార్థులకు జూన్ 5వ తేదీ వరకు సెలవులు కొనసాగనున్నాయి.