సింగరేణి ట్రేడ్ యూనియన్‌కు పూర్వ వైభవం తీసుకురావాలంటే మిలిటెంట్ యాక్టివిటీ చేయాలని మందమర్రి జీఎం ఆఫీసు, సింగరేణి భవన్ తగలబెట్టాలనీ, రైల్వే పట్టాలు కోసివేయాలని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందువల్ల ఆయనపై కేసు నమోదవ్వడంతో.. పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. తనను కక్ష పూరితంగా అరెస్టు చెయ్యడం కంటే.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనీ, మంచి పాలన అందించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి బాల్క సుమన్ సూచించారు.